Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • AISF పోరాట ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా NEET పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఉద్యమానికి చారిత్రాత్మక విజయం

    AISF పోరాట ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా  NEET పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఉద్యమానికి చారిత్రాత్మక విజయం

    అన్నమయ్య జిల్లా, రాజనీతి, జూలై 25,పుంగనూరు:

    NEET పరీక్ష పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్న తీరుకు వ్యతిరేకంగా CJP, AISF ఆధ్వర్యంలో నిర్వహించిన నిరంతర పోరాటాలకు చారిత్రాత్మక విజయం లభించిందని AISF రాష్ట్ర సమితి సభ్యులు మున్నా తెలిపారు.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్య పోరాటానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
    విద్యార్థుల సమస్యలపై AISF ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. విద్యార్థిలోకం ఐక్యంగా నిర్వహించిన పోరాటం ముందు పాలకుల మొండివైఖరి పటాపంచలైందని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా AISF రాష్ట్ర సమితి సభ్యులు మున్నా మాట్లాడుతూ:

    NEET పరీక్షల పేపర్ లీకేజీ, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.

    NTA (National Testing Agency)ను రద్దు చేయాలి.

    ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వైద్య ప్రవేశ పరీక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
    పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
    విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పరీక్షల లీకేజీలను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
    విద్యార్థులపై భారంగా మారిన జాతీయ విద్యా విధానం (NEP–2020)ను రద్దు చేయాలి.విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం AISF నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుంది.కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థుల ఐక్యతకు, AISF పోరాట ఫలితం లభించిన విజయంగా అభివర్ణించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని మున్నా తెలిపారు.

    అత్యధికంగా చదివినవి