AISF పోరాట ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా NEET పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఉద్యమానికి చారిత్రాత్మక విజయం
అన్నమయ్య జిల్లా, రాజనీతి, జూలై 25,పుంగనూరు: NEET పరీక్ష పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్న తీరుకు వ్యతిరేకంగా CJP, AISF ఆధ్వర్యంలో నిర్వహించిన నిరంతర పోరాటాలకు చారిత్రాత్మక విజయం లభించిందని AISF రాష్ట్ర సమితి సభ్యులు మున్నా తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్య పోరాటానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై AISF ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. విద్యార్థిలోకం ఐక్యంగా నిర్వహించిన పోరాటం ముందు పాలకుల మొండివైఖరి పటాపంచలైందని తెలిపారు. ఈ సందర్భంగా AISF రాష్ట్ర సమితి...