Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేంద్ర ఆరోగ్య నిఘా బృందం కలికిరిలో పర్యటన..! వైద్య సేవలపై సమగ్ర సమీక్ష

    కేంద్ర ఆరోగ్య నిఘా బృందం కలికిరిలో పర్యటన..! వైద్య సేవలపై సమగ్ర సమీక్ష

    ప్రెస్ నోట్

    కలికిరి, 2026 జూలై 22:

    సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ (CBHI) మానిటరింగ్ & మూల్యాంకన (Monitoring & Evaluation) పర్యటనలో భాగంగా బెంగళూరులోని సీబీహెచ్‌ఐ ఉప సంచాలకులు శ్రీ జి. రామచంద్రరావు గారు బుధవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) కలికిరిని సందర్శించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా ఆయన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. పవన్ కుమార్‌తో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (Electronic Health Records - EHR) నిర్వహణపై వివరాలు తెలుసుకొని, ఆసుపత్రి రికార్డు గదిని పరిశీలించారు.

    అనంతరం మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులు మరియు సీహెచ్‌సీ సిబ్బందితో సమావేశమై అంటువ్యాధులు (Communicable Diseases - CD) మరియు అసంక్రమిత వ్యాధులు (Non-Communicable Diseases - NCD) సంబంధిత నివేదికల సమర్పణ విధానంపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రిపోర్టింగ్ వ్యవస్థను పరిశీలించి, నివేదికలను సకాలంలో, ఖచ్చితంగా పంపించేలా అవసరమైన సూచనలు చేశారు.

    వచ్చే నెల నుంచి సాధారణంగా పంపుతున్న నివేదికలతో పాటు 16 అంటువ్యాధులకు (కలరా, డయేరియా తదితరాలు) మరియు 4 అసంక్రమిత వ్యాధులకు సంబంధించిన ప్రత్యేక నివేదికలను కూడా నిర్దేశిత నమూనాలో క్రమం తప్పకుండా సమర్పించాలని ఆయన సూచించారు.

    ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులు, సీహెచ్‌సీ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి