కేంద్ర ఆరోగ్య నిఘా బృందం కలికిరిలో పర్యటన..! వైద్య సేవలపై సమగ్ర సమీక్ష

ప్రెస్ నోట్ కలికిరి, 2026 జూలై 22: సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ (CBHI) మానిటరింగ్ & మూల్యాంకన (Monitoring & Evaluation) పర్యటనలో భాగంగా బెంగళూరులోని సీబీహెచ్‌ఐ ఉప సంచాలకులు శ్రీ జి. రామచంద్రరావు గారు బుధవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) కలికిరిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. పవన్ కుమార్‌తో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (Electronic Health Records - EHR) నిర్వహణపై వివరాలు తెలుసుకొని, ఆసుపత్రి రికార్డు గదిని పరిశీలించారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులు మరియు సీహెచ్‌సీ సిబ్బందితో సమావేశమై అంటువ్యాధులు (Communicable Diseases - CD) మరియు అసంక్రమిత వ్యాధులు...