Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దగ్గు మాత్రమే టి. బి. వ్యాధి లక్షణం కాదు.డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

    దగ్గు మాత్రమే టి. బి. వ్యాధి లక్షణం కాదు.డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

    కలికిరి 22/72026.
    దగ్గు మాత్రమే టి. బి (క్షయ )వ్యాధి లక్షణం కాదని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి ఆదేశాల మేరకు, జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక పర్యవేక్షణలో టి. బి. ముక్త్ భారత్ అభియాన్(2.0) 100రోజుల కార్యక్రమం లో భాగంగా మండలంలోని పత్తిగడ లోని ఐ. టి. బి. పి లో టి. బి. ముక్త్ భారత్ 2.0 లో భాగంగా సైనికులకు అవగాహనా సదస్సు మరియు టి. బి. వ్యాధి పైన స్క్రీనింగ్ డాక్టర్ శభానా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.వలనరబుల్ గ్రూప్ లో భాగంగా కాంగ్రీగేట్ సెట్టింగ్ లో సైనికులకు ఎక్సరేలు తీయడం జరిగింది.ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు దగ్గు ఒక్కటి మాత్రమే టి. బి వ్యాధి లక్షణం కాదని రోజూ సాయంత్రం వేళ జ్వరం రావడం, గల్ల తో కూడిన దగ్గు, ఒక్కోసారి గల్ల లో రక్తం కనపడుట, అలసట, నీరసం, రాత్రి వేళ చమటలు పట్టుట, బరువు తగ్గుతాఉండటం, ఛాతిలో నొప్పి, ఆకలి లేక పోవడం, సారీరక ఆరోగ్యములో ఆకస్మిక మార్పు, ఏదైనా శరీర భాగం లో గుల్లలు, వాపు రావడం, గతం లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఇవన్నీటీలో ఏవి కనిపించినా క్షయ వ్యాధి అని అనుమానించి దగ్గర లోని ప్రభుత్వ అస్పటల్ లో గల్ల పరీక్షలు, ఛాతి ఎక్సరే తీయించుకోవాలి. ఇప్పుడు టి. బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా సైనికులకు కాంగ్రీగేట్ సెట్టింగ్ లో భాగంగా హ్యాండ్ హోల్డ్ ఎక్సరేలు (ఛాతి ఎక్సరే) తీయడం జరిగింది. 82 మందికి ఎక్సరేలు తీయడం జరిగింది. కావున టి. బి. వ్యాధి నిర్ధారణ కొరకు చేసే ప్రతీ పరీక్షలు పూర్తిగా ఉచితంగా అన్నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో చేస్తారు. అలాగే వ్యాధి నిర్ధారణ ఐతే ఆరు నెలల పాటు మందులు పూర్తిగా ఉచితంగా డాట్స్ ద్వారా ఇస్తారు. రొగులు సమత్తుల ఆహరం తీసుకోవడం వల్ల ప్రతీ నెల క్రమం తప్పని ఫాలోఅప్ చేసుకొని పూర్తి ఆరోగ్య వoతులుగా ఉండవచ్చు అన్నారు. . ఈ కార్యక్రమం లో ఐ. టి. బి. పి. హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ షబానా,డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, డి. పి. సి. చెన్నారెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు సుధాకర్,టి. బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి,సి. హెచ్. ఓ /ఎమ్. ఎల్.హెచ్. పి లు సైరా బాను, చందుప్రియ ,ఏ. ఎన్. ఎమ్.అమ్మాజీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి