Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాండ్లలో ఎస్సీ, ఎస్టీ సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య

    Author RAJANEETHI | 21 Jul 2026, 06:08 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    జాండ్లలో ఎస్సీ, ఎస్టీ సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన  ఏపీ  ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య

    నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

    పీలేరు, జూలై 21: ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) శ్రీ గురవయ్య గారు మంగళవారం పీలేరు డివిజన్‌లో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు పీలేరు మండలం జాండ్ల గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ సోలార్ ప్లాంట్‌ను సందర్శించి నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు.

    ఈ సందర్భంగా పీలేరు డివిజన్ పరిధిలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజలకు నిరంతరం నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు పగటిపూట మాత్రమే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

    అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఫెయిల్యూర్ అయిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

    విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించేలా డిజిటల్ చెల్లింపు విధానాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమాచారం చేరవేయాలని ఆదేశించారు.

    ఈ సమావేశంలో పీలేరు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ *వై. చంద్రశేఖర్ రెడ్డి గారు, ట్రాన్స్‌ఫార్మర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నమయ్య విజయభాస్కర్ గారు, కన్స్ట్రక్షన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి గారు, పీలేరు ఆపరేషన్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అమీర్ భాషా గారు, శివయ్య గారు, అలాగే పీలేరు ఆపరేషన్ డివిజన్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి