జాండ్లలో ఎస్సీ, ఎస్టీ సోలార్ ప్లాంట్‌ను పరిశీలించిన ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య
నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం పీలేరు, జూలై 21: ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) శ్రీ గురవయ్య గారు మంగళవారం పీలేరు డివిజన్‌లో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు పీలేరు మండలం జాండ్ల గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ సోలార్ ప్లాంట్‌ను సందర్శించి నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా పీలేరు డివిజన్ పరిధిలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజలకు నిరంతరం నాణ్యమైన, అంతరాయం లేని...