Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డీ-రిజిస్టర్ వాహనాల కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలి: రవాణా శాఖ

    Author RAJANEETHI | 18 Jul 2026, 05:34 PM | ANDHRA PRADESH
    డీ-రిజిస్టర్ వాహనాల కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలి: రవాణా శాఖ

    తిరుపతి, జూలై 18 (రాజనీతి): ఢిల్లీలో డీ-రిజిస్టర్ చేసిన వాహనాలను నకిలీ పత్రాలతో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో పాత వాహనాల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. ఇటీవల డీ-రిజిస్టర్ అయిన ఓ ఢిల్లీ వాహనాన్ని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు స్వాధీనం చేసుకుని మంగళం డిపోకు తరలించారు. వాహనం కొనుగోలు ముందు వాహన్ (VAHAN) పోర్టల్ లేదా రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ వివరాలు తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని, అనుమానాస్పద వాహనాలపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.