డీ-రిజిస్టర్ వాహనాల కొనుగోలుపై అప్రమత్తంగా ఉండాలి: రవాణా శాఖ
తిరుపతి, జూలై 18 (రాజనీతి): ఢిల్లీలో డీ-రిజిస్టర్ చేసిన వాహనాలను నకిలీ పత్రాలతో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో పాత వాహనాల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. ఇటీవల డీ-రిజిస్టర్ అయిన ఓ ఢిల్లీ వాహనాన్ని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు స్వాధీనం చేసుకుని మంగళం డిపోకు తరలించారు. వాహనం కొనుగోలు ముందు వాహన్ (VAHAN) పోర్టల్ లేదా రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ వివరాలు తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని, అనుమానాస్పద వాహనాలపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.