Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాల్మీకిపురంలో అంగరంగ వైభవంగా జగన్ 2.O యాప్ పోస్టర్ ఆవిష్కరణ

    వాల్మీకిపురంలో అంగరంగ వైభవంగా జగన్ 2.O యాప్ పోస్టర్  ఆవిష్కరణ

    ఈరోజు తేది 18-07-2026 శనివారం ఉదయం 11:00 గంటలకు వాల్మీకిపురం పట్టణం EX-MLA గారి క్యాంప్ కార్యాలయం నందు జగన్ 2.O యాప్ పోస్టర్ ఆవిష్కరణ

    వాల్మీకిపురంలో అంగరంగ వైభవంగా జగన్ 2.O యాప్ పోస్టర్ ఆవిష్కరణ

    డిజిటల్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా మరో ముందడుగు

    కార్యకర్తలు సాంకేతికతను సద్వినియోగం చేసుకొని ప్రజలతో మమేకం కావాలి

    ఇవి కూడా చదవండి

    వాల్మీకిపురం EX-MLA గారి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జగన్ 2.O యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన నాయకులు...

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని డిజిటల్ వేదికపై మరింత బలోపేతం చేస్తూ, పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ విధానాలు, ప్రజా సమస్యలను వేగవంతంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో రూపొందించిన జగన్ 2.౦ యాప్ పోస్టర్ ను పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు వైకాపా నాయకులు మరియు కార్యకర్తలతో కలసి శనివారం వాల్మీకిపురం EX-MLA గారి క్యాంప్ కార్యాలయం లో ఘనంగా ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పార్టీ కార్యకర్తలు కూడా డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ 2.O యాప్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ కార్యక్రమాలు, నాయకత్వం చేపట్టే కార్యక్రమాల సమాచారాన్ని క్షణాల్లో కార్యకర్తలు, ప్రజలకు చేరవేయవచ్చని తెలిపారు.

    ప్రతి కార్యకర్త ఈ యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని విస్తృతంగా వినియోగించాలని, ప్రజలకు కూడా పరిచయం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తూ పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో జగన్ 2.o కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

    ఇట్లు
    EX-MLA గారి క్యాంప్ కార్యాలయం
    వాల్మీకిపురం

    అత్యధికంగా చదివినవి