Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టూ టౌన్ సీఐ నెట్టికంటయ్యకు పుత్తూరు అర్బన్‌కు బదిలీ

    Author RAJANEETHI | 16 Jul 2026, 03:01 PM | ANDHRA PRADESH
    టూ టౌన్ సీఐ నెట్టికంటయ్యకు పుత్తూరు అర్బన్‌కు బదిలీ

    శుక్రవారం కొత్త బాధ్యతలు స్వీకరణ...

    సమర్థ సేవలకు గుర్తింపుగా కీలక పోస్టింగ్...

    ప్రజలకు చేరువైన అధికారిగా ప్రత్యేక గుర్తింపు...

    ఇవి కూడా చదవండి


    చిత్తూరు జర్నలిస్ట్ (జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నెట్టికంటయ్య ను సాధారణ పరిపాలనా బదిలీలలో భాగంగా తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన కొత్త స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. చిత్తూరు టూ టౌన్ సీఐగా పనిచేసిన కాలంలో నెట్టికంటయ్య క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే నేరాల నియంత్రణలో పలు సమర్థ చర్యలు చేపట్టారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు నేరస్తులపై కఠినంగా వ్యవహరించారు. సిబ్బందితో సమన్వయం ప్రజలతో సత్సంబంధాలు ఆయన పనితీరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. పండుగలు, ఉత్సవాలు, ఎన్నికలు వంటి సున్నిత పరిస్థితుల్లో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణం కొనసాగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ట్రాఫిక్ నియంత్రణ, నేర నిరోధక చర్యలు, రాత్రి గస్తీలు, ప్రత్యేక తనిఖీల ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించారు. ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా పేరొందిన ఆయన స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేశారు. బాధితులతో మానవీయంగా వ్యవహరించడం సమస్యలను ఓర్పుతో వినడం ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన సేవలను సహచర అధికారులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, నిజాయితీ, సమర్థత కారణంగానే ఆయనకు పుత్తూరు అర్బన్ వంటి కీలక బాధ్యత లభించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త బాధ్యతల్లో కూడా అదే క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తారనే ఆశాభావాన్ని అధికారులు, స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పదవీ కాలంలో చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రజలకు మరింత చేరువైందని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

    అత్యధికంగా చదివినవి