టూ టౌన్ సీఐ నెట్టికంటయ్యకు పుత్తూరు అర్బన్‌కు బదిలీ

శుక్రవారం కొత్త బాధ్యతలు స్వీకరణ... సమర్థ సేవలకు గుర్తింపుగా కీలక పోస్టింగ్... ప్రజలకు చేరువైన అధికారిగా ప్రత్యేక గుర్తింపు... చిత్తూరు జర్నలిస్ట్ (జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నెట్టికంటయ్య ను సాధారణ పరిపాలనా బదిలీలలో భాగంగా తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌కు నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన కొత్త స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. చిత్తూరు టూ టౌన్ సీఐగా పనిచేసిన కాలంలో నెట్టికంటయ్య క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే నేరాల నియంత్రణలో పలు సమర్థ చర్యలు చేపట్టారు. కేసుల...