Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీలేరులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు పోరాటాలకు మంద కృష్ణ మాదిగ ను ఆదర్శంగా తీసుకోవాలి. పురం రామమూర్తి ఏఎంసీ చైర్మన్

    పీలేరులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు   పోరాటాలకు మంద కృష్ణ మాదిగ ను ఆదర్శంగా తీసుకోవాలి.   పురం రామమూర్తి ఏఎంసీ చైర్మన్

    పీలేరు జులై 8

    ఎం ఆర్ పి ఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్, ఎంఎస్సీ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి గండికోట వెంకటేష్ ఆధ్వర్యంలో పీలేరు పట్టణం కోటపల్లి క్రాస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామమూర్తి టిడిపి బీసీ సీనియర్ నాయకులు పోలిశెట్టి సురేంద్ర ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ కేవలం మాదిగ సామాజిక వర్గానికి నాయకుడు కాదని ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసి పోరాడిన నాయకుడని ఈ రాష్ట్రంలో సమస్యలపై పోరాడేందుకు పాదయాత్రలో మొదలుపెట్టింది,ఉద్యమాలకు పునాదివేసింది మంద కృష్ణ మాదిగ తోనే ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాలలో కుల నాయకులు తమ తమ వర్గాలకు నాయకత్వం పేరుతో చలామణి అవుతూ అన్ని సామాజిక వర్గాల నాయకులు పోరాటాలు చేస్తున్నారన్నారు ఏదైనా ఒక సమస్యపై పోరాటం చేయాలంటే మందకృష్ణ మాదిగను స్ఫూర్తిగా తీసుకొని పోరాడితే విజయం సాధించక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ యువ నాయకులు ఆర్ఎస్ మహేష్, వెంకీ, జాసిన్, దినేష్, ఎం ఈ ఎఫ్ నాయకులు దుడ్డు రామకృష్ణ,
    ఎంఆర్పిఎస్ పీలేరు మండల అధ్యక్షులు గండికోట రెడ్డి కుమార్, కలకడ మండల అధ్యక్షుడు వంగిమల్ల హరినాధ, కె.వి పల్లి మండల అధ్యక్షులు సందిపోగుల రాము, ఎంఎస్పి పీలేరు మండల అధ్యక్షులు ఇంగ్లే బాలసుబ్రమణ్యం, సీనియర్ నాయకులు రాచపల్లి వెంకటరమణ, మురళి, ఎమ్మార్పీఎస్ యువ నాయకులు యశస్విని, నరసింహ, పవన్, రాము, జానీ, హర్ష,హరీష్, హర్ష, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి