పీలేరులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు పోరాటాలకు మంద కృష్ణ మాదిగ ను ఆదర్శంగా తీసుకోవాలి. పురం రామమూర్తి ఏఎంసీ చైర్మన్
పీలేరు జులై 8 ఎం ఆర్ పి ఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్, ఎంఎస్సీ పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి గండికోట వెంకటేష్ ఆధ్వర్యంలో పీలేరు పట్టణం కోటపల్లి క్రాస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామమూర్తి టిడిపి బీసీ సీనియర్ నాయకులు పోలిశెట్టి సురేంద్ర ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ కేవలం మాదిగ సామాజిక వర్గానికి నాయకుడు కాదని ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో బడుగు బలహీన వర్గాల...