Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గాజులమండ్యం పట్టాభిరామ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

    Author admin | 17 Jun 2026, 10:17 PM | ANDHRA PRADESH
    గాజులమండ్యం పట్టాభిరామ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

    రేణిగుంట మండల పరిధిలోని గాజులమండ్యం గ్రామంలోని సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీశ్రీశ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభ, శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, జలాధివాసం, ధాన్యాధివాసం వంటి వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. 25న ప్రధాన కుంభాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

    అత్యధికంగా చదివినవి