Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చెత్తను తొలగిస్తూ.. నగరానికి సేవ చేస్తూ.. అవార్డు అందుకున్న ఈశ్వరరావు...

    చెత్తను తొలగిస్తూ.. నగరానికి సేవ చేస్తూ.. అవార్డు అందుకున్న ఈశ్వరరావు...

    చిత్తూరు(రాజనీతి): ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్థాయిలో చిత్తూరు నగరపాలక సంస్థకు ఐదు స్వచ్ఛ అవార్డులు దక్కాయి. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, డీఆర్వో మోహన్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.నగర స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో చిత్తూరు నగరపాలక సంస్థకు ఐదు అవార్డులు రావడం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా సుమారు 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈశ్వరరావుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీర్ఘకాలంగా పారిశుద్ధ్య సేవల్లో అంకితభావంతో పనిచేస్తున్నందుకు ‘ది బెస్ట్’ అవార్డును అందజేశారు.డీఆర్వో మోహన్‌కుమార్, కమిషనర్ నరసింహ ప్రసాద్ చేతుల మీదుగా ఈశ్వరరావు అవార్డును స్వీకరించారు. మూడు దశాబ్దాలుగా విధులకు అంకితమై పనిచేసిన తన సేవలను గుర్తించి పురస్కారం అందించడం ఆనందంగా ఉందని ఈశ్వరరావు తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల విజయానికి పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.