చెత్తను తొలగిస్తూ.. నగరానికి సేవ చేస్తూ.. అవార్డు అందుకున్న ఈశ్వరరావు...
చిత్తూరు(రాజనీతి): ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్థాయిలో చిత్తూరు నగరపాలక సంస్థకు ఐదు స్వచ్ఛ అవార్డులు దక్కాయి. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, డీఆర్వో మోహన్కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.నగర స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో చిత్తూరు నగరపాలక సంస్థకు ఐదు అవార్డులు రావడం పట్ల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా సుమారు 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈశ్వరరావుకు ప్రత్యేక గుర్తింపు లభించింది....