Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు

    ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు

    రాజనీతి | అమరావతి:
    ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదుల ఉధృతి, ముంపు ప్రాంతాలు, నీట మునిగిన పంటలు, చేపట్టిన పునరావాస చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం

    గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలను గుర్తించి ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరాలు అందించారు.

    హీర మండలం లిఫ్ట్‌ ప్రాజెక్టుపై ఆదేశాలు ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు వేగవంతం.. వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం

    హీర మండలం లిఫ్ట్‌ ప్రాజెక్టుకు విద్యుత్‌ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నీటిమట్టంపై సమీక్ష

    కృష్ణా నదికి ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా వరద ప్రవాహం లేదని అధికారులు సీఎంకు వివరించారు. స్థానిక క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితోనే ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం పెరుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో వరద నీటిని నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

    ఉత్తరాంధ్రలో వరద ప్రవాహాలు కొనసాగింపు

    ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద నీరు వస్తూనే ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు వంశధార, నాగావళి నదుల ప్రవాహాలు పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

    వర్షపాతం లోటు తగ్గింది

    తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.8 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు వివరించారు.

    వరదల వేళ పునరావాసంపై ఫోకస్.. మత్స్యకార కుటుంబాలకు బియ్యం నుంచి నీటి నిల్వల వరకు సీఎం కీలక ఆదేశాలు