ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు
రాజనీతి | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదుల ఉధృతి, ముంపు ప్రాంతాలు, నీట మునిగిన పంటలు, చేపట్టిన పునరావాస చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలను గుర్తించి ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరాలు అందించారు. హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుపై ఆదేశాలు ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు వేగవంతం.. వేటకు వెళ్లలేని...