Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాముకాటుపై రైతులకు అవగాహన... డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ

    Author RAJANEETHI | 23 Sep 2026, 02:49 PM | ANDHRA PRADESH
    పాముకాటుపై రైతులకు అవగాహన... డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ

    సదుం, సెప్టెంబరు 23 (రాజనీతి): ప్రపంచ పాముకాటు అవగాహన వారోత్సవాల్లో భాగంగా సేవా సంకల్ప్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో నడిగడ్డ రైతు సేవా కేంద్రంలో పాముకాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ గాయత్రి, డాక్టర్‌ హేమంత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ రైతులకు పాముకాటు నివారణ, అత్యవసర చర్యలపై వివరించారు. పొలాలకు వెళ్లేటప్పుడు బూట్లు, టార్చిలైట్లు వినియోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాముకాటుకు గురైతే ఎలాంటి పూత మందులు రాయకుండా, గాయం వద్ద కట్టు కట్టకుండా వెంటనే 108కు సమాచారం ఇచ్చి సమీప ఆస్పత్రికి తరలించాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎస్‌వీ చికిత్స ఉచితంగా అందుబాటులో ఉందన్నారు. అనంతరం రైతులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఆరోగ్య శాఖల సిబ్బంది, ఆశా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

    పాముకాటుపై రైతులకు అవగాహన... డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ - Additional Image