పాముకాటుపై రైతులకు అవగాహన... డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్‌ రఫీ

సదుం, సెప్టెంబరు 23 (రాజనీతి): ప్రపంచ పాముకాటు అవగాహన వారోత్సవాల్లో భాగంగా సేవా సంకల్ప్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో నడిగడ్డ రైతు సేవా కేంద్రంలో పాముకాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ గాయత్రి, డాక్టర్‌ హేమంత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ రైతులకు పాముకాటు నివారణ, అత్యవసర చర్యలపై వివరించారు. పొలాలకు వెళ్లేటప్పుడు బూట్లు, టార్చిలైట్లు వినియోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాముకాటుకు గురైతే ఎలాంటి పూత మందులు రాయకుండా, గాయం వద్ద కట్టు కట్టకుండా వెంటనే 108కు సమాచారం ఇచ్చి సమీప ఆస్పత్రికి తరలించాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎస్‌వీ చికిత్స ఉచితంగా అందుబాటులో ఉందన్నారు. అనంతరం...