Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాత బస్సుతో ప్రయాణికుల నరకయాతన

    Author RAJANEETHI | 08 Sep 2026, 09:28 PM | ANDHRA PRADESH
    పాత బస్సుతో ప్రయాణికుల నరకయాతన

    వీరబల్లి సెప్టెంబర్ 8 (రాజనీతి): రాయచోటి నుంచి గడికోటకు వెళ్లే ఆర్టీసీ బస్సు తరచూ మార్గమధ్యంలో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుకు సరైన ఫిట్‌నెస్‌ లేకపోవడంతో తరచూ మొరాయిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ మార్గంలో ఘాట్‌ రోడ్డు ఉండటంతో పాత బస్సులతో ప్రయాణించడం మరింత ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే ఆర్టీసీ అధికారులు స్పందించి, ఫిట్‌నెస్‌ కలిగిన మంచి బస్సును ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.