పాత బస్సుతో ప్రయాణికుల నరకయాతన
వీరబల్లి సెప్టెంబర్ 8 (రాజనీతి): రాయచోటి నుంచి గడికోటకు వెళ్లే ఆర్టీసీ బస్సు తరచూ మార్గమధ్యంలో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుకు సరైన ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ మొరాయిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ మార్గంలో ఘాట్ రోడ్డు ఉండటంతో పాత బస్సులతో ప్రయాణించడం మరింత ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే ఆర్టీసీ అధికారులు స్పందించి, ఫిట్నెస్ కలిగిన మంచి బస్సును ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.