Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఒక మహిళ.. ఎన్నో కష్టాలు.. ఒక్కటే లక్ష్యం.. విజయం! రోజా చౌదరి...

    ఒక మహిళ.. ఎన్నో కష్టాలు.. ఒక్కటే లక్ష్యం.. విజయం! రోజా చౌదరి...

    తండ్రిని కోల్పోయింది.. తాతను కోల్పోయింది.. అయినా గెలుపును వదల్లేదు!..


    కన్నీటి బాట నుంచి అవార్డుల వేదిక వరకు.. రోజా చౌదరి సక్సెస్ స్టోరీ!...

    చిత్తూరు: చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది.. చదువుకు అండగా నిలిచిన తాతను కూడా కోల్పోయింది.. వివాహం తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెబుతోంది.. పోలీసులను న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.. అయినా లక్ష్యాన్ని వీడలేదు...ఎదురైన కష్టాలను అధిగమిస్తూ ప్రస్తుతం అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగినట్లు చెబుతున్న ఐరాల మండలం కస్తూరునాయుడుపల్లెకు చెందిన పి.రోజా చౌదరి ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.1990 డిసెంబరు 14న పి.సుబ్బానాయుడు, పి.అనురాధమ్మ దంపతులకు ఏకైక కుమార్తెగా రోజా చౌదరి జన్మించారు. ఎనిమిది నెలల వయసులోనే తండ్రి మృతి చెందారు. దీంతో ఆమె తాత ఉప్పలపాటి వెంకటప్పనాయుడు కుటుంబానికి అండగా నిలిచారు. మనవరాలు ఉన్నత విద్య అభ్యసించి జీవితంలో స్థిరపడాలని ప్రోత్సహించినట్లు రోజా తెలిపారు. అయితే డిగ్రీ చదువుతున్న సమయంలో తాత కూడా మృతి చెందడంతో మరోసారి విషాదాన్ని ఎదుర్కొన్నానని చెప్పారు.

    వివాహం తర్వాత సమస్యలు...

    2016లో వివాహం, 2017లో కుమారుడు జన్మించారు. అనంతరం కుటుంబపరంగా పలు సమస్యలు ఎదురైనట్లు రోజా చౌదరి తెలిపారు. వరకట్నం పేరుతో వేధింపులు ఎదుర్కొన్నానని ఆరోపించారు. ఓ ఘటనలో తలకు గాయమై ఏడు కుట్లు పడ్డాయని చెప్పారు. తన భద్రత కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.2020లో అప్పటి జిల్లా ఎస్పీని కలిసి తన సమస్యలను వివరించి తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించినట్లు రోజా తెలిపారు. అనంతరం పోలీసు శాఖలో పనిచేస్తున్న తన మామపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2022లో భర్త హామీ ఇవ్వడంతో గతంలో నమోదైన కేసులను ఉపసంహరించుకున్నానని ఆ తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. సీసీ ఫుటేజీ, ఇతర ఆధారాలను భద్రపరిచినట్లు చెప్పారు.

    ఇవి కూడా చదవండి

    కోర్టుకు వెళ్తుండగా ఘటన...

    2024లో కుమారుడితో కలిసి కోర్టు వాయిదాకు వెళ్తున్న సమయంలో తనపై దాడికి ప్రయత్నం జరిగిందని రోజా ఆరోపించారు. కుమారుడు చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో వారు తనకు సహాయం చేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సీసీ ఫుటేజీని పోలీసులకు, కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తన భర్త జైలుకు వెళ్లారని అనంతరం హైకోర్టు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిపారు.అనంతరం రోజా చౌదరి కు పోలీసులు రెండు సంవత్సరాలు వరకు విమెన్ పోలీస్ ఎస్కార్ట్ ను ఇచ్చారన్నారు ...

    అవార్డుల దిశగా...

    కష్టాలు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదని రోజా చౌదరి తెలిపారు. 2026 ఆగస్టులో బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ‘ఐకానిక్ ఉమెన్ అవార్డు’కు ఎంపికైనట్లు చెప్పారు. అవార్డు పోస్టు ద్వారా 2026 ఆగస్టు 15న తన ఇంటికి చేరిందని తెలిపారు.ఈ అవార్డు ను చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు చేతుల మీదుగా తీసుకోవడం అభినందనీయమని ఆమె అన్నారు.2026 సెప్టెంబరులో చెన్నైలో ‘సౌత్ ఇండియా విమెన్స్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందుకోనున్నట్లు పేర్కొన్నారు.“ఇది నా కథకు ముగింపు కాదు.. ఆరంభం మాత్రమే. నా ఉద్యోగం, సాధించిన విజయాలు, జీవితంలో ఎదురైన మరిన్ని సంఘటనలను త్వరలో వెల్లడిస్తాను” అని రోజా తెలిపారు.

    పోలీసులకు రాఖీ...

    రక్షాబంధన్ సందర్భంగా తనకు రక్షణ కల్పించిన పోలీసులకు రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపినట్లు రోజా చెప్పారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన పోలీసుల సేవలను అభినందించారు.కష్టాల్లో కుంగిపోకుండా.. న్యాయపరంగా పోరాడుతూ.. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగుతున్న రోజా చౌదరి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.