ఒక మహిళ.. ఎన్నో కష్టాలు.. ఒక్కటే లక్ష్యం.. విజయం! రోజా చౌదరి...

తండ్రిని కోల్పోయింది.. తాతను కోల్పోయింది.. అయినా గెలుపును వదల్లేదు!.. కన్నీటి బాట నుంచి అవార్డుల వేదిక వరకు.. రోజా చౌదరి సక్సెస్ స్టోరీ!... చిత్తూరు: చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది.. చదువుకు అండగా నిలిచిన తాతను కూడా కోల్పోయింది.. వివాహం తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెబుతోంది.. పోలీసులను న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.. అయినా లక్ష్యాన్ని వీడలేదు...ఎదురైన కష్టాలను అధిగమిస్తూ ప్రస్తుతం అవార్డులు అందుకునే స్థాయికి ఎదిగినట్లు చెబుతున్న ఐరాల మండలం కస్తూరునాయుడుపల్లెకు చెందిన పి.రోజా చౌదరి ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.1990 డిసెంబరు 14న పి.సుబ్బానాయుడు, పి.అనురాధమ్మ దంపతులకు ఏకైక కుమార్తెగా రోజా చౌదరి జన్మించారు. ఎనిమిది నెలల వయసులోనే తండ్రి మృతి చెందారు. దీంతో ఆమె...