Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి.. చిత్తూరులో ధర్నా

    న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి.. చిత్తూరులో ధర్నా

    చిత్తూరు: న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ యాక్ట్‌ను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చిత్తూరులో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... న్యాయవాదులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వారి భద్రతకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ అవసరమని పేర్కొన్నారు.న్యాయవాదులు న్యాయవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం పనిచేస్తున్న తమకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రొటెక్షన్ యాక్ట్‌లో నిబంధనలు ఉండాలని కోరారు.న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్‌లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నాలో న్యాయవాదులు చంద్రమౌళి, వర్ష, అశోక్, ఆనంద్ యాదవ్, చిన్నబ్బా, లీలా, రవి, సురేష్‌రెడ్డి, శంకరనాయుడు, అమర్‌నాథ్‌రెడ్డి, లోకనాథనాయుడు, సుబ్రహ్మణ్యం, జ్యోతిరామ్, మనోహర్, మురళి, బాలయ్య, ఆనంద్, సుగుణశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.