న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి.. చిత్తూరులో ధర్నా
చిత్తూరు: న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చిత్తూరులో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... న్యాయవాదులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వారి భద్రతకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ అవసరమని పేర్కొన్నారు.న్యాయవాదులు న్యాయవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం పనిచేస్తున్న తమకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రొటెక్షన్ యాక్ట్లో నిబంధనలు ఉండాలని కోరారు.న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, రక్షణ...