Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దళితవాడ సమస్యల పరిష్కారానికి ‘చలో కలెక్టరేట్‌

    Author RAJANEETHI | 23 Aug 2026, 02:57 PM | ANDHRA PRADESH
    దళితవాడ సమస్యల పరిష్కారానికి ‘చలో కలెక్టరేట్‌

    రేణిగుంట, ఆగస్టు 23 (రాజనీతి): దళితవాడల సమస్యల పరిష్కారం కోసం కెవీపీఎస్‌ ఆధ్వర్యంలో తూకివాకం హరిజనవాడ నుంచి రెండో రోజు ‘ఆటో ప్రచార జాత’ నిర్వహించారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆగస్టు 24న ‘చలో కలెక్టరేట్‌’కు తరలిరావాలని పిలుపునిచ్చారు. దళితుల స్మశానవాటికలు, రహదారులు, తాగునీరు, భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం 10 గంటలకు అర్జీలతో కలెక్టరేట్‌కు రావాలని సూచించారు. కార్యక్రమంలో కెవీపీఎస్‌, ఐద్వా నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.