దళితవాడ సమస్యల పరిష్కారానికి ‘చలో కలెక్టరేట్
రేణిగుంట, ఆగస్టు 23 (రాజనీతి): దళితవాడల సమస్యల పరిష్కారం కోసం కెవీపీఎస్ ఆధ్వర్యంలో తూకివాకం హరిజనవాడ నుంచి రెండో రోజు ‘ఆటో ప్రచార జాత’ నిర్వహించారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆగస్టు 24న ‘చలో కలెక్టరేట్’కు తరలిరావాలని పిలుపునిచ్చారు. దళితుల స్మశానవాటికలు, రహదారులు, తాగునీరు, భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం 10 గంటలకు అర్జీలతో కలెక్టరేట్కు రావాలని సూచించారు. కార్యక్రమంలో కెవీపీఎస్, ఐద్వా నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.