Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గంగమ్మ జాతరలో భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు

    Author RAJANEETHI | 17 Aug 2026, 09:29 PM | ANDHRA PRADESH
    గంగమ్మ జాతరలో భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు

    రేణిగుంట, ఆగస్టు 17 (రాజనీతి): చారిత్రక ప్రాశస్త్యం కలిగిన రేణిగుంట గంగమ్మ జాతర మంగళవారం జరగనున్న నేపథ్యంలో భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీఐ జయచంద్ర తెలిపారు. జాతరకు వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆకతాయిలు, దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. భక్తుల రక్షణే తమ బాధ్యతని, జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీఐ ఆదేశించారు.