Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రత్యేక ప్రతిభావంతుల మధ్య ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

    Author RAJANEETHI | 15 Aug 2026, 10:50 AM | ANDHRA PRADESH
    ప్రత్యేక ప్రతిభావంతుల మధ్య ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

    రేణిగుంట, ఆగస్టు 15 (రాజనీతి): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫైర్‌ వర్క్స్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ అధినేత రంగ శ్రీహరి సహకారంతో రేణిగుంట పంచాయతీ పరిధిలోని బిస్మిల్లా నగర్‌లో ఉన్న ప్రత్యేక ప్రతిభావంతుల పునరావాస కేంద్రం అభయ క్షేత్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న అసోసియేషన్‌ ప్రతినిధులు వారిలో ఆనందాన్ని నింపారు. అనంతరం అభయ క్షేత్రంలో ఆశ్రయం పొందుతున్న ప్రత్యేక ప్రతిభావంతులకు మిఠాయిలు పంపిణీ చేసి, వారితో ఆత్మీయంగా మమేకమయ్యారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా వారి అవసరాలకు అండగా నిలిచేలా నిత్యావసర సరుకులను కూడా అందజేశారు.
    ఈ సందర్భంగా 25 కిలోల10 బస్తాల బియ్యం, 50 కిలోల కందిపప్పు తదితర సరుకులను అభయ క్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా బేగంకు అసోసియేషన్‌ ప్రతినిధులు అందజేశారు.
    సేవా కార్యక్రమాలే నిజమైన దేశభక్తికి ప్రతీక
    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జెండా ఆవిష్కరణ, వేడుకలకే పరిమితం కాకుండా సమాజంలోని నిరుపేదలు, నిరాశ్రయులు, ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన రోజుగా భావిస్తున్నామని తెలిపారు.
    సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానం లేని వారిని ఆదరించడం, వారికి అవసరమైన సమయంలో చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుల పునరావాస కేంద్రానికి అవసరమైన నిత్యావసర సరుకులు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
    “దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు.. వారి ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవ చేయడమే నిజమైన దేశభక్తి” అని వారు పేర్కొన్నారు.
    అభయ క్షేత్రంలో ప్రత్యేక ప్రతిభావంతులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
    కార్యక్రమంలో ఫైర్‌ వర్క్స్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, అభయ క్షేత్రం నిర్వాహకులు, సిబ్బంది, ప్రత్యేక ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు.

    ప్రత్యేక ప్రతిభావంతుల మధ్య ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు - Additional Image
    అత్యధికంగా చదివినవి