ప్రత్యేక ప్రతిభావంతుల మధ్య ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

రేణిగుంట, ఆగస్టు 15 (రాజనీతి): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫైర్‌ వర్క్స్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ అధినేత రంగ శ్రీహరి సహకారంతో రేణిగుంట పంచాయతీ పరిధిలోని బిస్మిల్లా నగర్‌లో ఉన్న ప్రత్యేక ప్రతిభావంతుల పునరావాస కేంద్రం అభయ క్షేత్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న అసోసియేషన్‌ ప్రతినిధులు వారిలో ఆనందాన్ని నింపారు. అనంతరం అభయ క్షేత్రంలో ఆశ్రయం పొందుతున్న...