Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పదవి కోసం కాదు.. పవన్‌ కోసం....చిత్తూరు 8వార్డు వెంగళరావు కాలనీ కే.శ్యామ్ కుమార్...

    Author GNANAPRAKASH | 10 Aug 2026, 02:30 AM | ANDHRA PRADESH, Politics, చిత్తూరు
    పదవి కోసం కాదు.. పవన్‌ కోసం....చిత్తూరు 8వార్డు వెంగళరావు కాలనీ కే.శ్యామ్ కుమార్...

    పవన్‌ కళ్యాణ్‌ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తా....

    నిరుపేద కుటుంబం నుంచి.. పవన్‌ అభిమాని వరకు....

    ప్రాణం పవన్‌.. ఊపిరి జనసేన....శ్యామ్ కుమార్..

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంటే తనకు ఎంతో అభిమానం, ఆరాధన అని చిత్తూరు 8వ వార్డు వెంగళరావు కాలనీకి చెందిన జనసేన నాయకుడు కే.శ్యామ్‌కుమార్‌ అన్నారు. ఆయన పట్ల ఉన్న అభిమానంతోనే పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. ఎలాంటి పదవి ఆశించకుండా పవన్‌కళ్యాణ్‌ ఆశయాలు, ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనది నిరుపేద కుటుంబ నేపథ్యమని, రాజకీయంగా ఎలాంటి అండదండలు లేకపోయినా పవన్‌కళ్యాణ్‌పై ఉన్న అభిమానమే తనకు బలమని శ్యామ్‌కుమార్‌ చెప్పారు. తనను ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా పార్టీ కోసం పనిచేయడంలో వెనుకడుగు వేయబోనన్నారు. పవన్‌కళ్యాణ్‌ను తన ప్రాణంగా భావిస్తానని, ఆయన ఆశయాల సాధన కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

    సొంత నిధులతో సేవా కార్యక్రమాలు....

    ఇవి కూడా చదవండి

    పవన్‌కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను సొంత నిధులతో చేపడుతున్నట్లు శ్యామ్‌కుమార్‌ తెలిపారు. పేదలకు, అవసరమైన వారికి తనకు సాధ్యమైనంత మేరకు సహాయం చేయడమే తనకు సంతృప్తినిస్తుందన్నారు. అభిమానాన్ని కేవలం మాటల్లో కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా చాటుకోవాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.

    రాజకీయాలు తెలియవు.. అభిమానం మాత్రమే తెలుసు....

    తనకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదని, పవన్‌కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే జనసేనలో పనిచేస్తున్నానని శ్యామ్‌కుమార్‌ తెలిపారు. పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పవన్‌కళ్యాణ్‌ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, ఆయన ఆలోచనా విధానాన్ని ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

    విమర్శిస్తే ఖబడ్దార్‌.....

    పవన్‌కళ్యాణ్‌పై అనవసర విమర్శలు చేసే వారు ఒకసారి ఆయన ప్రజా జీవితాన్ని, ప్రజల కోసం చేస్తున్న సేవలను తెలుసుకోవాలని శ్యామ్‌కుమార్‌ సూచించారు. తమ నాయకుడిపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే జనసైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పవన్‌కళ్యాణ్‌ ఆశయాలు, జనసేన సిద్ధాంతాల కోసం చివరి వరకు పనిచేస్తానని స్పష్టం చేశారు.పదవులు వచ్చినా రాకపోయినా తనకు పవన్‌కళ్యాణ్‌ అభిమానిగా ఉండటమే గర్వకారణమని శ్యామ్‌కుమార్‌ అన్నారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి పేదలకు అండగా నిలుస్తానని తెలిపారు....

    అత్యధికంగా చదివినవి