పదవి కోసం కాదు.. పవన్‌ కోసం....చిత్తూరు 8వార్డు వెంగళరావు కాలనీ కే.శ్యామ్ కుమార్...

పవన్‌ కళ్యాణ్‌ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తా.... నిరుపేద కుటుంబం నుంచి.. పవన్‌ అభిమాని వరకు.... ప్రాణం పవన్‌.. ఊపిరి జనసేన....శ్యామ్ కుమార్.. చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంటే తనకు ఎంతో అభిమానం, ఆరాధన అని చిత్తూరు 8వ వార్డు వెంగళరావు కాలనీకి చెందిన జనసేన నాయకుడు కే.శ్యామ్‌కుమార్‌ అన్నారు. ఆయన పట్ల ఉన్న అభిమానంతోనే పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. ఎలాంటి పదవి ఆశించకుండా పవన్‌కళ్యాణ్‌ ఆశయాలు, ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనది నిరుపేద కుటుంబ నేపథ్యమని, రాజకీయంగా ఎలాంటి అండదండలు లేకపోయినా పవన్‌కళ్యాణ్‌పై ఉన్న అభిమానమే...