Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *ఎల్నినో ప్రభావం.. వేరుశెనగ రైతులు అప్రమత్తం కావాలి*

    *ఎల్నినో ప్రభావం.. వేరుశెనగ రైతులు అప్రమత్తం కావాలి*

    సోమల, రాజనీతి,ఆగస్టు 4: ఎల్నినో ప్రభావంతో వర్షాధార వేరుశెనగ పంట బెట్ట పరిస్థితుల్లోకి వెళ్లి వాడిపోతున్న నేపథ్యంలో రైతులు తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్లపల్లి శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, కృషి విజ్ఞాన కేంద్రం బృందం మంగళవారం సోమల మండలంలోని కరకమంద, వడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు.
    ఈ సందర్భంగా శాస్త్రవేత్త డా. ఎం. రెడ్డికుమార్ మాట్లాడుతూ, లీటరు నీటికి 20 గ్రాముల యూరియా లేదా 13:00:45 నీటిలో కరిగే ఎరువు 5 గ్రాములు కలిపి ఆకులపై పిచికారీ చేస్తే బెట్ట పరిస్థితులను కొంతవరకు అధిగమించే అవకాశం ఉంటుందని తెలిపారు.
    బోర్ల కింద వరి సాగుకు బదులుగా కంది, పెసర, మినుములు, అలసంద, కొర్ర, ఉలవ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులు మెరుగైన దిగుబడులు పొందవచ్చని సూచించారు.
    అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కింద వరి, కంది పంటలకు పంట బీమా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఇందుకు ఆగస్టు 15 వరకు గడువు ఉందని రైతులకు వివరించారు. *సోమల మండలంలో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన – పంట సంరక్షణ, బీమాపై అవగాహన*
    కార్యక్రమంలో పెరుమాళ్లపల్లి శాస్త్రవేత్త డా. ఠాగూర్, సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, వ్యవసాయ అధికారి సుధాకర్, రైతు సేవా కేంద్రం అధికారులు చంద్రకళ, శ్రీకాంత్ పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.