*ఎల్నినో ప్రభావం.. వేరుశెనగ రైతులు అప్రమత్తం కావాలి*

సోమల, రాజనీతి,ఆగస్టు 4: ఎల్నినో ప్రభావంతో వర్షాధార వేరుశెనగ పంట బెట్ట పరిస్థితుల్లోకి వెళ్లి వాడిపోతున్న నేపథ్యంలో రైతులు తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్లపల్లి శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, కృషి విజ్ఞాన కేంద్రం బృందం మంగళవారం సోమల మండలంలోని కరకమంద, వడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డా. ఎం. రెడ్డికుమార్ మాట్లాడుతూ, లీటరు నీటికి 20 గ్రాముల యూరియా లేదా 13:00:45 నీటిలో కరిగే ఎరువు 5 గ్రాములు కలిపి ఆకులపై పిచికారీ చేస్తే బెట్ట పరిస్థితులను కొంతవరకు...