Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్

    Author RAJANEETHI | 31 Jul 2026, 09:54 PM | ANDHRA PRADESH, చిత్తూరు
    ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్

    55 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు సత్వర న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, ఒక్కో సమస్యను శ్రద్ధగా విన్నారు. సమస్యల స్వరూపాన్ని తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఎస్ వ్యవస్థ ద్వారా ప్రజల వినతుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికార యంత్రాంగాన్ని జవాబుదారీతనంతో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిల్లోనూ అధికారులు ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి సంకోచం లేకుండా ఎప్పుడైనా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించి వినతిపత్రాలు సమర్పించవచ్చని ఆయన సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని, ప్రతి వినతిని పరిశీలించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మొత్తం 55 వినతులు అందాయి. భూ సమస్యలు, రెవెన్యూ, హౌసింగ్, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించిన వినతులు అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వినతిని నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపిస్తూ నిర్ణీత గడువులో పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టారు.కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, తహశీల్దార్లు కళ్యాణి, శ్రీనివాసులు, ఎంహెచ్వో డా. అనిల్ కుమార్, హౌసింగ్ డీఈ శ్రీధర్, మాజీ మేయర్ అముద, తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కుమారి, నాయకులు సురేంద్ర కుమార్, సుబ్బానాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.