ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్

55 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు సత్వర న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, ఒక్కో సమస్యను శ్రద్ధగా విన్నారు. సమస్యల స్వరూపాన్ని తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని...