Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్తూరులో వ్యభిచార గుట్టు రట్టు.. ఐదుగురు అదుపులో....

    Author RAJANEETHI | 31 Jul 2026, 08:00 PM | ANDHRA PRADESH
    చిత్తూరులో వ్యభిచార గుట్టు రట్టు.. ఐదుగురు అదుపులో....

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు వ్యభిచారం, మహిళల అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చిత్తూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం చిత్తూరు ఎస్‌డీపీవో జె. వెంకటనారాయణ పర్యవేక్షణలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ చిన్న పెద్దయ్య, ఎస్‌ఐలు శివశంకర్, మారెప్పతో పాటు పోలీసు సిబ్బంది పట్టణంలోని పలు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి కోల్‌కతా నుంచి ముగ్గురు మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న భార్యాభర్తలు రీతు కొలి, సోమనాథ్ కొలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సహకరించిన లాడ్జీ మేనేజర్ రాజుపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ,... జిల్లాలో వ్యభిచారం, మహిళల అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్ యాజమాన్యాలు తమ సంస్థల్లో జరిగే కార్యకలాపాలపై పూర్తి బాధ్యత వహించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తే యజమానులు, నిర్వాహకులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, డయల్-112 లేదా చిత్తూరు పోలీసుల వాట్సాప్ నంబర్ 9440900005కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

    అత్యధికంగా చదివినవి