చిత్తూరులో వ్యభిచార గుట్టు రట్టు.. ఐదుగురు అదుపులో....
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు వ్యభిచారం, మహిళల అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చిత్తూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం చిత్తూరు ఎస్డీపీవో జె. వెంకటనారాయణ పర్యవేక్షణలో వన్టౌన్ ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ్య, ఎస్ఐలు శివశంకర్, మారెప్పతో పాటు పోలీసు సిబ్బంది పట్టణంలోని పలు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి కోల్కతా నుంచి ముగ్గురు మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న భార్యాభర్తలు రీతు కొలి, సోమనాథ్ కొలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సహకరించిన లాడ్జీ మేనేజర్ రాజుపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు...