Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మాలమహానాడు ఆధ్వర్యంలో దళిత ఉద్యమ సారథి, మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

    మాలమహానాడు ఆధ్వర్యంలో దళిత ఉద్యమ సారథి, మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

    ** పత్రికా ప్రకటన ***
    అన్నమయ్య జిల్లా పీలేరు
    27/07/2026

    మాలమహానాడు ఆధ్వర్యంలో దళిత ఉద్యమ సారథి, మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ


    దళిత బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక, ప్రముఖ సామాజిక విప్లవకారుడు, దళిత మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకలను మాలమహానాడు,దళిత వేదిక అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాలమహానాడు కార్యాలయంలో నాయకులు అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం,కత్తి పద్మారావు గారికి కేక్ కోసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
    ఈ సందర్బంగా మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ మాట్లాడుతూ కారంచేడు,చుండూరు,వంటి చారిత్రాత్మక దళిత ఆత్మగౌరవ పోరాటాలకు నాయకత్వం వహించిన ధీశాలి కత్తి పద్మారావు గారు అని కొనియాడారు.అణగారిన వర్గాల రాజ్యాధికారం,హక్కుల సాధన కోసం ఆయన రాసిన సాహిత్యం,చేసిన ప్రసంగాలు సమాజంలో ఎనలేని చైతన్యాన్ని నింపాయని గుర్తుచేశారు.బౌద్ధ,అంబేడ్కర్ వాదాలను తాత్విక నేపథ్యంగా తీసుకుని ఆయన చేసిన సామాజిక కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.కత్తి పద్మారావు గారి ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని,అణగారిన వర్గాల ఐక్యత కోసం మాలమహానాడు నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు అన్నమయ్య ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, దళిత వేదిక అన్నమయ్య జిల్లా కన్వీనర్ గుండ్లూరు ఇరగన్న, మాలమహానాడు మండల కార్యదర్శి తుమ్మల రవి కుమార్, ప్రచార కార్యదర్శి గొడుగు చింతల రాజేంద్ర బాబు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి