మాలమహానాడు ఆధ్వర్యంలో దళిత ఉద్యమ సారథి, మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

** పత్రికా ప్రకటన *** అన్నమయ్య జిల్లా పీలేరు 27/07/2026 మాలమహానాడు ఆధ్వర్యంలో దళిత ఉద్యమ సారథి, మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ దళిత బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక, ప్రముఖ సామాజిక విప్లవకారుడు, దళిత మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకలను మాలమహానాడు,దళిత వేదిక అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాలమహానాడు కార్యాలయంలో నాయకులు అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం,కత్తి పద్మారావు గారికి కేక్ కోసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ మాట్లాడుతూ కారంచేడు,చుండూరు,వంటి చారిత్రాత్మక దళిత...