Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "On Govt Duty", "Police", "Press" తదితర స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్. - ప్రభుత్వ హోదాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యం.

     "On Govt Duty", "Police", "Press" తదితర స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్.  - ప్రభుత్వ హోదాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యం.

    తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
    తేదీ:27-07-2026.

    - తిరుపతి నగరంలో ప్రత్యేక తనిఖీలు.

    - అనధికారిక అధికారిక గుర్తింపు స్టిక్కర్ల తొలగింపు.

    - "On Govt Duty", "Police", "Press" తదితర స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్.

    - ప్రభుత్వ హోదాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యం.

    ఇవి కూడా చదవండి

    - ట్రాఫిక్ నిబంధనల అమలులో రాజీ లేదని పోలీసుల హెచ్చరిక.

    తిరుపతి 27: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీఎస్పీ గారి పర్యవేక్షణలో, ట్రాఫిక్ సీఐ శ్రీ భాస్కర్ నాయక్ గారు తమ సిబ్బందితో కలిసి ఈరోజు తిరుపతి నగర పరిధిలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

    ఈ సందర్భంగా వాహనాలపై అనుమతి లేకుండా ప్రదర్శిస్తున్న "On Govt Duty", "Police", "Press" తదితర అధికారిక హోదా/గుర్తింపు స్టిక్కర్లను గుర్తించి తొలగించారు. ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగం, మీడియా సంస్థల పేర్లు లేదా అధికారిక గుర్తింపులను అనుమతి లేకుండా వినియోగించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై మోటారు వాహన చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

    ప్రజలు తమ వాహనాలపై చట్టబద్ధమైన అనుమతి లేని అధికారిక స్టిక్కర్లు, లోగోలు లేదా గుర్తింపులను ఉపయోగించకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఇటువంటి ప్రత్యేక తనిఖీలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

    జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో రాజీ ఉండదని, ప్రభుత్వ హోదాలను లేదా అధికారిక గుర్తింపులను దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహిస్తామని ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు

    అత్యధికంగా చదివినవి