Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైకాపాకు షాక్.. టీడీపీ గూటికి 300 మంది...

    Author RAJANEETHI | 25 Jul 2026, 08:09 AM | ANDHRA PRADESH
    వైకాపాకు షాక్.. టీడీపీ గూటికి 300 మంది...

    ఎమ్మెల్యే గురజాల సమక్షంలో 300 మంది టీడీపీలో చేరిక...

    అభివృద్ధిని చూసి కూటమి వైపు ప్రజల అడుగులు: ఎమ్మెల్యే...

    చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం వేలూరు రోడ్డులోని స్వాగత్ గ్రాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో సుమారు 300 మంది టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. నగరంలోని 16, 17, 18, 19 వార్డులకు చెందిన పలువురు వైకాపా నాయకులు, యువత తమ అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16వ వార్డు నుంచి అశోక్ తన కుటుంబ సభ్యులు,అనుచరులతో కలిసి పార్టీలో చేరగా, 17వ వార్డు నుంచి వినోద్, రాజేష్ తమ అనుచరులతో చేరారు. 19వ వార్డు నుంచి కార్తీక్, రవి, నవీన్, నిర్మలమ్మ, పాండుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేరిన వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. చిత్తూరులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీపై విశ్వాసంతో ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని చెప్పారు.పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, ఇప్పటికే పనిచేస్తున్న కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వం, పార్టీ, స్థానిక నాయకత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువత, వివిధ వార్డులకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
    ఈ సందర్భంగా స్థానిక నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్‌ల సేవలను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, నియోజకవర్గ పరిశీలకులు పురిమిట్ల కుమారి, ఎస్. మనోహర్, రాజేష్ కుమార్ రెడ్డి, అను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి