వైకాపాకు షాక్.. టీడీపీ గూటికి 300 మంది...

ఎమ్మెల్యే గురజాల సమక్షంలో 300 మంది టీడీపీలో చేరిక... అభివృద్ధిని చూసి కూటమి వైపు ప్రజల అడుగులు: ఎమ్మెల్యే... చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం వేలూరు రోడ్డులోని స్వాగత్ గ్రాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో సుమారు 300 మంది టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. నగరంలోని 16, 17, 18, 19 వార్డులకు చెందిన పలువురు వైకాపా నాయకులు, యువత తమ అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16వ వార్డు నుంచి అశోక్...