Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అఖిలపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పీలేరులో విద్యాసంస్థల బంద్ విజయవంతం

    Author RAJANEETHI | 24 Jul 2026, 06:18 PM | ANDHRA PRADESH
    అఖిలపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పీలేరులో విద్యాసంస్థల బంద్ విజయవంతం

    పీలేరు, 2026 జూలై 24:

    అఖిలపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు, NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ ఆదేశాల మేరకు, నేడు పీలేరు పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి NSUI జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ నాయకత్వం వహించారు. విద్యార్థి సంఘాల పిలుపునకు విద్యార్థులు, యువత విశేషంగా స్పందించడంతో పలు విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి.

    ఈ సందర్భంగా సాయి సంపత్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన NEET పరీక్షలో జరిగిన అక్రమాలు అత్యంత ఆందోళనకరమని అన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

    ఇవి కూడా చదవండి

    అలాగే, ఢిల్లీలో విద్యార్థులు, యువత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితరులు చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేయడం, విద్యార్థులు, యువతపై పోలీసు బలప్రయోగం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

    NEET పరీక్షలో జరిగిన అక్రమాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, లేదా కేంద్ర ప్రభుత్వం ఆయనను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. NEET అక్రమాలపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారానికి సంబంధించి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

    ప్రభుత్వం తమ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

    ఈ కార్యక్రమంలో NSUI నియోజకవర్గ నాయకులు లోకేష్, అభిరామ్,నగేష్ AISF మండల అధ్యక్షులు ప్రేమ్, ఆదిత్య, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.