Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అక్షరాయుధంతో సామాజిక వివక్షపై పోరాడిన ధీరుడు గుర్రం జాషువా:-పాలకుంట శ్రీనివాసులు

    అక్షరాయుధంతో సామాజిక వివక్షపై పోరాడిన ధీరుడు గుర్రం జాషువా:-పాలకుంట శ్రీనివాసులు

    పీలేరు 24-07-2026:

    సాహిత్య రత్న మహాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని పీలేరు పట్టణంలోని స్థానిక భారతీయ అంబేద్కర్ సేన కార్యాలయంలో బాస్ నాయకులు గుండ్లూరి రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు హాజరై గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ గుర్రం జాషువా గారు నాడు సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష మరియు సామాజిక రుగ్మతలపై తన అక్షరాలనే ఆయుధాలుగా చేసుకుని పోరాడారని కొనియాడారు.సాధారణ కవులు అందాన్ని వర్ణిస్తే, జాషువా గారు సమాజంలో అణగారినవర్గాల ప్రజల గుండె కోతను తన కవిత్వంలో ప్రతిబింబించారని ఆయన రాసిన 'గబ్బిలం' కావ్యం రచన దళిత సమాజ ఆవేదనకు సజీవ సాక్ష్యమని, ఫిరదౌసి ,ముంతాజ్ మహల్’ వంటి అద్భుత కావ్యాలతో తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి గుర్రం జాషువా అని కావున నేటి యువత, విద్యార్థులు జాషువా గారు చూపిన సామాజిక చైతన్యాన్ని, సమానత్వ భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకొని కులమతాలు లేని సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన నాయకులు గుండ్లూరి రవీంద్ర, పల్లె పోగు హరినాధ, ముల్లంగి గురవయ్య, శివకుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి