అక్షరాయుధంతో సామాజిక వివక్షపై పోరాడిన ధీరుడు గుర్రం జాషువా:-పాలకుంట శ్రీనివాసులు

పీలేరు 24-07-2026: సాహిత్య రత్న మహాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని పీలేరు పట్టణంలోని స్థానిక భారతీయ అంబేద్కర్ సేన కార్యాలయంలో బాస్ నాయకులు గుండ్లూరి రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు హాజరై గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ గుర్రం జాషువా గారు నాడు సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష మరియు సామాజిక రుగ్మతలపై తన అక్షరాలనే ఆయుధాలుగా చేసుకుని పోరాడారని కొనియాడారు.సాధారణ కవులు అందాన్ని వర్ణిస్తే, జాషువా గారు సమాజంలో అణగారినవర్గాల ప్రజల...