Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీసు శాఖ క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేసిన పోలీసు శాఖ ప్రతినిధులు

    పోలీసు శాఖ క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేసిన పోలీసు శాఖ ప్రతినిధులు

    అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం 22-07-2026

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని పోలీసు శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వినతిపత్రం సమర్పించారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం జారీ చేసిన G.O.Ms.No.45లో ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న పోస్టులను మల్టీ-జోనల్ క్యాడర్‌గా వర్గీకరించిన నేపథ్యంలో, అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Inspector of Police) పోస్టును కూడా మల్టీ-జోనల్ క్యాడర్‌గా ప్రకటించడం సముచితమని మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు.

    ఇవి కూడా చదవండి

    అయితే, G.O.Ms.No.103 ద్వారా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టును జోనల్ క్యాడర్‌గా వర్గీకరించారని, పరిపాలనా సౌలభ్యం, సిబ్బంది నిర్వహణలో సమర్థత, క్యాడర్ వ్యవస్థలో ఏకరూపత దృష్ట్యా ఇన్‌స్పెక్టర్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా పునర్వర్గీకరించాలని కోరారు.

    అదేవిధంగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌కు బదులుగా స్టేట్ క్యాడర్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విధుల నిర్వహణ, పరిపాలనా బాధ్యతలు, అవసరమైన చోట సేవలు అందించే సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.

    అనంతరం, G.O.Ms.No.103లో అవసరమైన సవరణలు చేసి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్టును స్టేట్ క్యాడర్‌గా ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కోరారు.

    వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పోలీసు శాఖ ప్రతినిధులు తెలిపిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

    అత్యధికంగా చదివినవి