పోలీసు శాఖ క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేసిన పోలీసు శాఖ ప్రతినిధులు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం 22-07-2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని పోలీసు శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం జారీ చేసిన G.O.Ms.No.45లో ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న పోస్టులను మల్టీ-జోనల్ క్యాడర్‌గా వర్గీకరించిన నేపథ్యంలో, అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Inspector of Police) పోస్టును కూడా మల్టీ-జోనల్ క్యాడర్‌గా ప్రకటించడం సముచితమని మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, G.O.Ms.No.103 ద్వారా...